ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేం కేసులు పెడితే ఏమయ్యేవారు?: నక్కా ఆనందబాబు

కోడెల విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం కొందరు నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

nakka-comments-on-ycp-govt

By

Published : Sep 30, 2019, 4:59 PM IST

మేం కేసులు పెడితే ఏమయ్యేవారు?నక్కా ఆనందబాబు
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో దివంగత కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కణ కార్యక్రమం జరిగింది. పార్టీ ముఖ్యనేతలు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, నక్కా ఆనందబాబు, రాయపాటి సాంబశివరావుతో పాటు కోడెల కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు
ఆత్మహత్య చేసుకునేలా వైకాపా ప్రభుత్వం కొందరు నేతలను వేధిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గతంలో పరిటాల రవి లాంటి నేతలను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. గత తెదేపా ప్రభుత్వం ఏనాడూ కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పిల్లిని గదిలో పెట్టి కొడితే పులిలా మారుతుందనే విషయం ప్రభుత్వం గుర్తించాలని హెచ్చరించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే వైకాపా నేతలు ఏమయ్యేవారు అని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details