నవ్యాంధ్ర శాసనసభ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. వైద్యునిగా సేవా దృక్పథంతో పనిచేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పేదలకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు.
గుంటూరులో ఘనంగా కోడెల జయంతి - కోడెల శివప్రసాదరావు జయంతి
మాజీ సభాపతి 74వ జయంతి వేడుకలను తెదేపా నేతలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. రాజకీయ నాయకునిగా, వైద్యునిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

గుంటూరులో ఘనంగా కోడెల జయంతి వేడుకలు