దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వారం రోజులు జరుపుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. దేశ త్యాగధనుల చరిత్రను భావితరాలు తెలుసుకోవాలంటే కనీసం వారం రోజులు ముందు నుంచైనా ఈ వేడుకలు జరపాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నేడు దేశ భ్యవిష్యత్ కోసం త్యాగాలు చేసే వారు కరవయ్యారని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు దేశసమైక్యత కోసం ప్రతి జనసేన కార్యకర్త త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని వారం రోజులు జరుపుకోవాలి:పవన్ - AINDIPENDENCE DAY
మంగళగిరి జనసేన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షుడు జనసేనాని...జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న జనసేనాని పవన్