దిశ చట్టం రాష్ట్రంలో మహిళలకు వరంలాంటిదని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దిశ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు జరగడం చాలా బాధాకరమని వాపోయారు. ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం.. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందిని చెప్పారు. చట్టంపై బాలురకూ అవగాహన కల్పించాలన్నారు. హాజరైన మరో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. యువత సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దిశ చట్టం.. రాష్ట్ర మహిళలకు వరం: మంత్రి సుచరిత - latest news on disha
దిశ చట్టం రాష్ట్రంలో మహిళలకు వరం లాంటిదని హోం శాఖ మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దిశ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు.
దిశ చట్టంపై హోంమంత్రి