ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్రాడీపేటను కంటైన్మెంట్ జోన్​గా చేసేందుకు సన్నాహాలు - guntur dst coivd news

గుంటూరులోని బ్రాడీపేటలో కరోనా పాజిటివ్ కేసులు 15 దాటటంతో కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడే కంట్రోల్‌ రూమ్​ ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశాలు జారీ చేశారు.

guntur dst bradipeta willbe declared as red zone
guntur dst bradipeta willbe declared as red zone

By

Published : Jul 6, 2020, 10:24 AM IST

గుంటూరులోని బ్రాడీపేటలో కరోనా విజృంభిస్తుండటంతో కంటైన్మెంట్‌ జోన్​గా ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇక్కడ కరోనా కేసులు 15 దాటాయి. ఒక్క నాలుగో లైనులోనే అత్యవసర వాహనాలు అనుమతించేందుకు వీలుగా గేటు ఏర్పాటు చేశారు.

ఇక్కడే కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత ఇల్లు బ్రాడీపేటలోనే ఉంది. కంటైన్మెంట్‌ జోన్‌ కారణంగా ఆమె బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details