కృష్ణా జిల్లా మైలవరం స్థానిక నూజివీడు రోడ్డు లోని వినాయకుని దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి... అనంతరం వేల మంది భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు.
సందడిగా వినాయక నిమజ్జనం వేడుకలు గుంటూరు జిల్లా...
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బకింగ్ హోమ్ కెనాల్ వినాయక నిమజ్జనాలతో సందడిగా మారింది. గుంటూరు, పొన్నూరు, చేబ్రోలు పరిసర ప్రాంతాల నుంచి వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ప్రతిమలను ఊరేగింపులో తీసుకువచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. కెనాల్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ నీటిపారుదల పోలీసు శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు
ఇవీ చూడండి-జై జై గణేశా...జై కొడతా గణేశా....