తాగునీటిలో కలుస్తున్న మురుగునీటిపై స్థానికుల ఆవేదన.. ప్రహరీ సమస్య వల్లే కలుషితం..
గుంటూరు నగరంలోని మురుగునీరంతా నగరాలు, రెడ్డిపాలెం, గడ్డిపాడు మీదుగా తక్కెళ్లపాడులోని మురుగునీటి వంతెన మీదుగా దిగువకు వెళుతోంది. ఈ మురుగునీటి వంతెన కింద నుంచే గుంటూరు ఛానల్ ప్రవహిస్తుంది. తక్కెళ్లపాడు వద్ద ఉన్న మురుగునీటి వంతెన ప్రహరీ ఎప్పుడో పడిపోయినా.. ఇంత వరకూ దాని నిర్మాణ పనులు జరగలేదు. దీనివల్ల అక్కడ మురుగునీరు గుంటూరు ఛానల్‌లోని మంచినీటిలో కలవడం వల్లే సమస్య మెుదలైంది. తాడేపల్లి నుంచి మొదలుకుని పత్తిపాడు నియోజకవర్గం వరకు సుమారుగా ఐదు నియోజకవర్గాల తాగునీటి అవసరాలు గుంటూరు ఛానల్ తీరుస్తోంది.
వాగ్దానాలకే పరిమితమైన నాయకులు..
మామూలు రోజుల్లో ఈ సమస్య తీవ్రత అంతంత మాత్రంగానే ఉన్నా.. వర్షం పడిన సమయంలో మాత్రం దిగువకు వెళ్లే మురుగునీటి కంటే గుంటూరు ఛానల్‌లో కలిసిపోత్తున్నవే ఎక్కువని నగరవాసులు అంటున్నారు. గతంలో అనేకమార్లు ప్రజాప్రతినిధులు తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ అవి వాగ్దానాలకే పరిమితమయ్యాయి. ఇంత వరకూ అవి కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా మంచినీరు కలుషితమవడంతో దానిపై అధారపడిన వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తాగు, సాగునీటికి వినియోగించుకునే నీటిలో గుంటూరు నగరంలోని మురుగునీరంతా వచ్చి చేరుతుందని అనేక మార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని ఫలితంగా అదే నీటిని తాగాల్సి వస్తుందంటున్నారు స్థానికులు వాపోతున్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి కోట్లు ఖర్చుచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు నీటి కలుషితాన్ని గురించి పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలకొని ఉన్న సమస్యకు అధికారులైన స్పందించి తాగునీటిలో మురుగునీరు కలవకుండా స్పందించి ప్రహరీను నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
'ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడాలి'