ఎస్ఈసీ తొలగింపుపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన వారిలో మస్తాన్ వలి కూడా ఒకరు.
ఇకనైనా సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలి: మస్తాన్ వలి
ఎస్ఈసీ తొలగింపుపై ప్రభుత్వ తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని అన్న ఆయన.. ఇప్పటికైనా సీఎం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.
Congress leaders mastna vali
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు.. రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించకూడదని సూచించారు. చట్టవిరుద్ధమైన జీవోలతో రమేశ్ కుమార్‌ని ప్రభుత్వం తొలగించిందన్నారు. ఈ తీర్పుతోనైనా సీఎం జగన్ వైఖరి మారాలన్నారు.
ఇదీ చదవండి :హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: జీవీఎల్