చంద్రబాబు రాక నేపథ్యంలో గుంటూరు బైపాస్ వద్ద తెదేపా శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిని పోలీసులు అడ్డుకుని... యువకుల బైక్ తాళాలు లాక్కున్నారు. ఇది తెలుసుకున్న చంద్రబాబు వెంటనే వాహనశ్రేణి దిగి రోడ్డుపైకి వచ్చారు. బైక్ తాళాలు తిరిగి ఇచ్చేయాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఇది న్యాయమా అంటూ నిలదీశారు. తప్పుడు పనులు చేయవద్దంటూ హితవు పలికారు. అయినప్పటికీ పోలీసులు తాళాలు ఇవ్వకపోవటంతో చంద్రబాబు ద్విచక్రవాహనం ఎక్కారు. అనంతరం యువకుల బైక్ తాళాలను పోలీసులు తిరిగిచ్చేశారు.
పోలీసుల తీరుకు నిరసనగా బైక్ ఎక్కిన చంద్రబాబు - తెదేపా బైక్ ర్యాలీ
గుంటూరు బైపాస్ వద్ద తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. యువకుల బైక్ తాళాలు లాక్కున్న పోలీసులపై మండిపడ్డారు. వాహనశ్రేణి దిగి ద్విచక్రవాహనం ఎక్కారు.
chandrababu fire on police for stopping a bike rally