పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. సరిహద్దు వెంబడి పదే పేదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అలజడిని సృష్టించడానికి ప్రయత్నించే పాక్ సరిహద్దు రక్షణ దళం.. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు భారత పౌరులను పొట్టనబెట్టుకుంది.
ఇదీ చూడండి:- ఎలాంటి సవాలుకైనా సై: సైన్యాధిపతి నరవాణే
జమ్ముకశ్మీర్ పుంఛ్ సెక్టార్ వద్ద నిరాయుధులైన ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టనపెట్టుకుంది . అందులో ఒకరి తల, మొండెం వేరు చేసింది. మృతి చెందిన వారిని మహ్మద్ అస్లాం, అల్తాఫ్ హుస్సేన్‌గా గుర్తించింది భారత సైన్యం. ఈ దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:- 16ఏళ్లలో 2019లోనే పాక్ అత్యధిక కాల్పులు