అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... గుంటూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 46వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధానిని మార్చడం భావ్యం కాదన్నారు. జగన్ ప్రభుత్వం ఒక సామాజికవర్గం ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖలో భూములను దోచుకునేందుకే 3 రాజధానుల అంశానికి తెరతీశారని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. 3 రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.
'ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా..?'
అమరావతి రైతుల ఆందోళనలు 57వ రోజుకు చేరుకున్నాయని... కేంద్రప్రభుత్వం రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని తెదేపా నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. గుంటూరులో రాజకీయ ఐకాస చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు.
అమరావతి కోసం గుంటూరులో రిలే నిరాహారదీక్షలు