ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అరెస్టులతో అమరావతి ఉద్యమం ఆగదు'

మీడియాపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న 14మంది రాజధాని రైతులు విడుదలయ్యారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని రైతులు స్పష్టం చేశారు.

amaravathi farmers release from guntur jail
అరెస్టైన రైతులు విడుదల

By

Published : Jan 11, 2020, 1:54 PM IST

గుంటూరు జైలు నుంచి రైతులు విడుదల

అరెస్టులతో అమరావతి ఉద్యమం ఆగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. మీడియాపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైలులో ఉన్న 14 మంది రాజధాని రైతులు ఇవాళ విడుదలయ్యారు. జైలు వద్ద గల్లా జయదేవ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన జయదేవ్.. పోలీసులు ఉన్నతాధికారుల మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని, చట్టాలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తీవ్రవాదులతో వ్యవహరించినట్లు రైతులతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడిని కేంద్ర మహిళా కమిషన్​కు వివరిస్తామని తెలిపారు. పోలీసుల అణచివేత చర్యలు తమని ఆపలేవని రాజధాని రైతులు స్పష్టం చేశారు. వైకాపాకు ఓటు వేసినందుకు మాకు ఫలితం ఇదా అని వారు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details