పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న తెలుగుదేశం పార్టీ స్థానాల్లో జనసేన, భాజపా అభ్యర్థులు ఉంటే వారి తరుఫున ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి.
జనసేన, భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తా : చింతమనేని ప్రభాకర్ - eluru latest news
ఏలూరు నగరపాలక సంస్థ నామినేషన్ల ఉపసంహరణ దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న స్థానాల్లో జనసేన, భాజపా అభ్యర్థులు పోటీ చేస్తే వారి తరఫున ప్రచారం చేస్తానని అన్నారు.
జనసేన, భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తా : చింతమనేని ప్రభాకర్