ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు గవర్నర్ ఫోన్.. ఏలూరు ఘటనపై ఆరా

సీఎం జగన్​కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫోన్ చేశారు. ఏలూరు ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వపరంగా అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

ap governer
ap governer

By

Published : Dec 8, 2020, 6:15 PM IST

ఏలూరు ఘటనపై రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రత్యేక దృష్టి సారించారు. స్వయంగా సీఎం జగన్​తో ఫోన్​లో మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా సుమారు 467 మంది వింత వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరారని, ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించటం వల్ల 263 మంది కోలుకుని తమ నివాసాలకు చేరుకున్నారని సీఎం వివరించారు.

వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్న వారందరికీ పూర్తి స్థాయి వైద్యం అందిస్తున్నామని, అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని విజయవాడకు తరలించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయస్థాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్థల సహకారం తీసుకుంటున్నామని, ఎయిమ్స్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్ఐఎన్ వంటి సంస్థలు బాధితుల రక్త నమూనాలతో పాటు అవసరమైన ఇతర అన్ని నమూనాలను పరీక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

వింత వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించే క్రమంలో, ప్రభుత్వపరంగా మరింత అప్రమత్తత అవసరమని గవర్నర్ అన్నారు. వేగవంతమైన పనితీరు కనబరిచేలా వైద్యారోగ్య శాఖ యంత్రాంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలకు అన్ని విధాలా ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ఇదీ చదవండి

భాజపా-జనసేన నేతల భేటీ.. కీలకాంశాలపై చర్చ

ABOUT THE AUTHOR

...view details