ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని పార్లమెంటులో మాట్లాడినందుకే. తనకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని.. కానీ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వమే మాతృభాషలోనే విద్యాభోధన కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రపంచమంతా ఒకదారి, నాదో దారి అని సీఎం అనుకోవద్దని హితవు పలికారు.
మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్న ఎంపీ.. రాష్ట్ర విద్యావిధానంలో ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేయవద్దని కోరారు. చిన్న రాష్ట్రాలు కూడా మాతృభాషకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. ఆంగ్ల మాధ్యమాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేశారు.