రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి 3 రాజధానులు సహా 4 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలని... జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అన్ని ప్రాంతాల వైకాపా నేతలు సమర్థించారు. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా కమిటీ సూచనలు ఉన్నాయన్నాయని ఉత్తరాంధ్ర నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేయమని బొత్స పేర్కొన్నారు. కమిటీ సూచించిన ప్రకారం ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ఉద్ఘాటించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పారు.