ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 6, 2020, 4:14 PM IST

ETV Bharat / city

'బీసీల కోటాను తగ్గించడం చరిత్రాత్మక తప్పిదం'

బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నారని తెదేపా నేత యనమల ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక ద్రోహం చేసిందని విమర్శించారు.

yanamala ramakrishnudu talks about ycp government Reducing BC reservations
యనమల రామకృష్ణుడు

వైకాపా సర్కారుపై తెదేపా నేత యనమల విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ చర్యను బీసీలు, బీసీ సంఘాలు వ్యతిరేకించాలన్నారు. బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కేందుకు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసే కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతం రిజర్వేషన్ సాధించగా ఇప్పుడు జగన్ ఎందుకు ఆ పని చేయటం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు ఇప్పటికే జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, అధికార బలంతో ఓటర్లను, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details