ఇదీ చదవండి
సీఆర్డీఏకు అమరావతి మహిళల అభ్యంతరాలు - three capital news
హైపవర్ కమిటికి అభ్యంతరాలు తెలియజేసేందుకు తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి ర్యాలీగా వచ్చి సీఆర్డీఏ అధికారులకు అభ్యంతర పత్రాలు అందజేశారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని లోటు తీర్చేందుకు తాము భూములు ఇచ్చామని రైతులు గుర్తు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభ్యంతరాలు చెప్పేందుకు సీఆర్డీఏ చాలా తక్కువ సమయం ఇచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ నగరంగా రాజధాని అమరావతి ఎదుగుతుందని తాము భావిస్తే... సీఎం జగన్ వేరే చోటికి తీసుకెళ్లటం సరికాదంటోన్న మహిళా రైతులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి
సీఆర్డీఏకు మహిళామణుల అభ్యంతరాలు