ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సినిమా రేంజ్​లో ఓ భార్య క్రైమ్​ కథ.. భర్తను చంపించి ఆపై.. - భర్తను ప్రియుడితో చంపించిన భార్య

జీవింతాంతం తోడుగా నిలవాల్సిన భార్య.. ఆ భర్త పాలిట మరణ శాసనమైంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు.. భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. సినిమా రేంజ్​లో ఓ ప్లాన్​ వేసి.. ప్రియుడితోనే చంపించింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రం ఓరుగల్లులో జరిగింది.

Wife who killed husband in Warangal  at telangana
సినిమా రేంజ్​లో ఓ భార్య క్రైమ్​ కథ.. భర్తను చంపించి ఆపై..

By

Published : Feb 6, 2021, 10:07 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్​ జిల్లాలో ప్రియుడిపై ఉన్న మోజుతో తాళికట్టిన భర్తను భార్య హత్య చేయించింది. హత్య చేయించిన ఘటనలో పోలీసులు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 4 సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడించారు.

గత జనవరి నెల 24 తేదిన వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన తాళ్లపల్లి అనిల్ అనే వ్యక్తి కనబడటం లేదని అతని భార్య పూజిత ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసుగా.. హన్మకొండలోని సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్న సమయంలో కనబడకుండా పోయిన వ్యక్తి తాళ్లపల్లి అనిల్.. గత జనవరి 29న రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్​లో శవమై కనిపించాడు. మృతుడి భార్య పూజితపై బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో మృతుడి మరణానికి కారణం భార్య పూజితతో పాటు, హన్మకొండ డ్యాని, హన్మకొండ సతీష్, కొట్టి సుధామణిలు నిందితులని పోలీసులు నిర్వహించిన విచారణలో తేలింది. సుబేదారి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే...

2018 సంవత్సరంలో మృతుడికి వరుసకు తమ్ముడైన హన్మకొండ డ్యాని వద్ద మృతుడు అనిల్ తన ట్రాలీ ఆటోను తనఖా పెట్టి లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. నిందితుడు డ్యాని ప్రతి రోజు మృతుడు ఇంటికి వెళ్లి అప్పు వాయిదా పద్ధతిలో తీసుకోనేవాడని అన్నారు. ఇదే క్రమంలో డ్యానికి, పూజితకు మధ్య పరిచయం కావడంతో వీరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వాళ్లు శారీరకంగా కలుసుకొనేందుకు డ్యాని అక్క సుధామణి.. తన ఇంటిలోనే అవకాశం కల్పిస్తూ వీరికి సహకరించేదని పేర్కొన్నారు.

అయితే భర్తను అడ్డు తొలిగిస్తే.. మనం కలిసి ఉండొచ్చని డ్యానికి పూజిత తెలిపింది. గత జనవరి 22న తన భర్త అనిల్​ హైదరాబాద్​ వెళ్లినట్లు తెలిపింది. డ్యాని.. తన తమ్ముడైన హన్మకొండ సతీశ్​ సహకారం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి... అనిల్​ను కొట్టి.. అతని చొక్కాతోనే గొంతు బిగించి చంపేశారు. అనంతరం అనిల్ మృతదేహాన్ని కాలువలో పడవేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు పూజిత పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని వరంగల్‌ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details