ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపాను ఎందుకు గెలిపించామా అనుకుంటున్నారు'

ఆంధ్రప్రదేశ్​ మండలిలో వైకాపా మంత్రుల తీరును తెలంగాణ తెదేపా నేతలు తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైకాపాను ఎందుకు గెలిపించామా ? అని బాధపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ తెదేపా నేతలు
తెలంగాణ తెదేపా నేతలు

By

Published : Jan 24, 2020, 8:01 PM IST

తెలంగాణ తెదేపా నేతలు

వైసీపీని ఎందుకు గెలిపించామా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చిందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అభిప్రాయపడ్డారు. వై.ఎస్. రాజశేఖర్​రెడ్డి మండలిని ఏర్పాటు చేస్తే.. జగన్ దానిని రద్దు చేసే ప్రయత్నాలు చేయటం అత్యంత బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ మాట్లాడుతూ...వైకాపా మంత్రుల తీరు బాధ కలిగించిందన్నారు. మండలిలో సభ్యులు కాకపోయినా మంత్రి హోదాలో కౌన్సిల్​కు హాజరై...ఛైర్మన్​ని వ్యక్తిగతంగా దుర్భాషలాడటం శోచనీయమన్నారు. విజయసాయి రెడ్డి ఏ ఉద్దేశ్యంతో మండలి సమావేశాలకు హాజరయ్యారో స్పష్టం చేయలన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విలువను పెంచిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details