ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 22, 2021, 11:51 AM IST

Updated : Jan 22, 2021, 2:38 PM IST

ETV Bharat / city

స్థానిక ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

vja-sec-nimmagadda
vja-sec-nimmagadda

11:49 January 22

పంచాయతీరాజ్‌ అధికారులతో మధ్యాహ్నం ఎస్​ఈసీ సమావేశం

రేపు తొలిదఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల వ్యవహారంపై గవర్నర్​ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో.. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమై చర్చించారు. రాజ్​భవన్​కు చేరుకున్న నిమ్మగడ్డ 11.30 గంటలకు గవర్నర్​తో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి అంశాలపై చర్చించారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ .. రేపు తొలి దఫా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయిచింది. ఎన్నికల నిర్వహణ కోసం తాను తీసుకోబోతున్న చర్యలపై గవర్నర్​తో ఎస్ఈసీ చర్చించారు. ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపుతూ హైకోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఉద్యోగులు నిరాకరిస్తున్నారని.. సహకరించేలా వారికీ ఆదేశాలివ్వాలని కోరినట్లు తెలిసింది.

గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎన్నికల విధులు ఇవ్వడం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సమయంలో పలుచోట్ల దౌర్జన్యాలు, దాడులను నివారించడంలో విఫలమయ్యారని.. విచారణ నివేదికల దృష్ట్యా వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

గవర్నర్​తో సమావేశం అనంతరం నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి రమేశ్‌ కుమార్ వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు.. ఎస్​ఈసీని కలవనున్నారు. ఎన్నికల కమిషనర్‌తో సమావేశానికి హాజరుకానున్న పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్.. తొలి దశ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఎన్నికల రిజర్వేషన్లు, నామినేషన్ల అంశంపై సమాలోచనలు చేస్తారు. అలాగే సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరుపుతారు.

ఇదీ చదవండి:అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత

Last Updated : Jan 22, 2021, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details