ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వంటనూనె దుకాణాలపై విజిలెన్స్​ దాడులు.. 18 కేసులు నమోదు

Vigilance raids : రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి.. వినియోగదారుల్ని దోచుకుంటున్న వంటనూనెల వ్యాపారులే లక్ష్యంగా విజిలెన్స్ అధికారులు గుంటూరులో తనిఖీలు చేపట్టారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. అధికారుల సోదాల సమాచారంతో కొంతమంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేస్తున్నారు.

Vigilance raids
Vigilance raids

By

Published : Mar 14, 2022, 10:34 PM IST

Vigilance raids : గుంటూరు జిల్లాలోని నకరికల్లు, దాచేపల్లి, పొన్నూరు, చెరుకుపల్లిలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెట్ విక్రయాలు పెరిగిపోతుండటంతో అధికారులు దాడులు చేపట్టారు. నిత్యావసర సరుకుల స్టోర్స్, దుకాణాలు, వంట నూనెల గోడౌన్స్, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి.. రికార్డ్స్ పరిశీలించారు.

సరుకులు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ, ప్రమాణాలు సరిగా లేని 18 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా వంటనూనెలు, వంటనూనె గింజలు అక్రమంగా నిల్వ చేసి అధిక రేట్లకు అమ్మితే... తమకు సమాచారము ఇవ్వవలసిందిగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:కొబ్బరి బోండాలు తాగారు... డబ్బులు అడిగితే కత్తులు తీశారు!

ABOUT THE AUTHOR

...view details