మాతృభాషను(MOTHER TONGUE) కాపాడుకునేందుకు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(VENKAIAH NAIDU) అన్నారు. మాతృభాషల రక్షణకు సృజనాత్మక విధానాలు అవసరమని పేర్కొన్నారు. భాషను సృజనాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సృజనాత్మకంగా ఉంటేనే భవిష్యత్ తరాలను ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు కూటమి అధ్యక్షుడు కోదండరామయ్య హాజరయ్యారు.
మాతృభాష కోల్పోతే గుర్తింపు, గౌరవం కోల్పోతామని వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు కూటమిని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలని ఆకాంక్షించారు. ఇతర భాషల సాహిత్యం తెలుగు(telugu)లోకి అనువాదం అవుతోందని తెలిపారు. కానీ తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావట్లేదని పేర్కొన్నారు.