వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును నవంబరు 1కి వాయిదా వేసింది.
ఊహాజనిత ఆరోపణలు
సీబీఐ ఊహాజనిత ఆరోపణలతో కౌంటర్ దాఖలు చేసిందని సీఎం జగన్ అన్నారు. కౌంటర్లో సీబీఐ వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నాననీ.. తాను హాజరు కాకుంటే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో తెలపాలని జగన్ అన్నారు. ఆరేళ్లుగా ఎప్పుడూ కేసుల వాయిదా కోరలేదనీ.. స్టే అడగలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా పాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత తనపై ఉందన్నారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు ఒక్క ఆరోపణ తనపై లేదన్నారు.