ఏపీ రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఏడారిలోకి వెళ్తున్నట్లు ఉంది అని సభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ నాయకుడిలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తమ్మినేని సీతారాం తనతో వస్తే అమరావతిని చుట్టి చూపిస్తానని తెలిపారు. సచివాలయం, శాసనసభ, శాసన మండలి, ఉద్యోగుల భవంతులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదా అని ప్రశ్నించారు. 'దృష్టి లోపం ఏమైనా ఉందా స్పీకర్ గారు' అంటూ ఎద్దేవా చేశారు. కళ్లజోడు పెట్టుకుని అమరావతిని చూడాలని సభాపతికి సూచించారు.
' కళ్లజోడు పెట్టుకోండి.. అమరావతి కనిపిస్తుంది' - అమరావతి ఎడారి
అమరావతిపై సభాపతి చేసిన వ్యాఖ్యలకు వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. దృష్టి లోపం ఏమైనా ఉందా అని తమ్మినేనిని ప్రశ్నించారు. తనతో వస్తే అమరాతిలోని భవనాలను చూపిస్తానని స్పష్టం చేశారు.
వర్ల రామయ్య