ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తగ్గిన టీకాల పంపిణీ..

రాష్ట్రంలో 2 రోజులనుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది. 3 రోజుల నుంచి 40 వేల నుంచి 50వేల మందికే వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ రానందున వ్యాక్సినేషన్​ ప్రక్రియ మందకొడిగా జరుగుతోంది.

vaccination process in andhra pradesh
vaccination process in andhra pradesh

By

Published : Jul 9, 2021, 9:51 AM IST

రాష్ట్రంలో 2 రోజులనుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ రానందున రాష్ట్రంలో చాలా తక్కువ కేంద్రాల్లో పంపిణీ అవుతోంది. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్న సమయంలో రోజూ లక్షన్నర మందికి టీకా వేస్తున్నారు. 3 రోజుల నుంచి 40 వేల నుంచి 50వేల మందికే వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అది కూడా రెండో డోసు వేయించుకునే వారికి ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు.. రెండో డోసు టీకా పొందాల్సిన వారిలో కొందరు అయోమయానికి గురవుతున్నారు. తొలి డోసు టీకా తీసుకునే సమయంలో నమోదు చేసిన వివరాల ప్రకారం లబ్ధిదారుల సెల్‌ఫోన్లకు కొవిన్‌ యాప్‌ ద్వారా రెండో డోసు వేయించుకోవాలని తేదీని పేర్కొంటూ సంక్షిప్త సమాచారం వస్తోంది. దాని ఆధారంగా ఆరోగ్య సిబ్బందిని సంప్రదిస్తే.. వ్యాక్సిన్‌ అందుబాటులో లేదనే సమాధానం వస్తోంది. ఫలానా కేంద్రం పేరు అని ఎస్‌ఎంఎస్‌లో లేనందున ఎక్కడినుంచైనా పొందవచ్చని వారు చెబుతున్నారు. మరోవైపు.. ఈ నెల 10న కొవిషీల్డ్‌ 7లక్షల డోసుల వరకు కేంద్రం నుంచి విజయవాడకు వస్తుందని భావిస్తున్నారు. అప్పటివరకు టీకాల పంపిణీ మందకొడిగానే సాగనుంది. కేంద్రం నుంచి బుధవారం విజయవాడకు వచ్చిన 45వేల డోసుల కొవాగ్జిన్‌ టీకాలను గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, మరో జిల్లాకు పంపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details