TS High Court Notices to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులపై రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్ దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెరాస హైదరాబాద్ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 గజాలు ఇవ్వడం.. అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100కే కేటాయించడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తెరాస అధినేత సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్‌ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..:తెరాస హైదరాబాద్ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో 4,935 చదరపు గజాల భూమిని మే 11న ప్రభుత్వం కేటాయించింది. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం గజానికి వంద రూపాయలకే తెరాసకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ఉద్యోగి, అఖిల భారత ఎస్సీ, ఎస్టీల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.మహేశ్వర్ రాజ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో వంద రూపాయలకు గజం చొప్పున ఎకరానికి మించకుండా స్థలం కేటాయించేందుకు 2018లో ఆగస్టు 16న జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.