ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @9am

.

top ten news
top ten news

By

Published : May 26, 2020, 9:05 AM IST

  • జూన్ 17 నాటికి నివేదిక..!

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నత స్థాయి కమిటీ.. జూన్ 17 నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమగ్ర సమాచారం తీసుకుంటున్న కమిటీ.. సవివరంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • ఉపావాస దీక్షలు

ఆలయ ఆస్తుల వేలం నిరసిస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం భాజపా ఉపవాస దీక్షలు ప్రారంభించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష చేయాలని శ్రేణులకు పిలుపిచ్చారు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • సేవలు షురూ..

నేటి నుంచి గన్నవరం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నుంచి బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు ప్రయాణికులు విమానాశ్రయం చేరుకున్నారు. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి...

  • విషాద గాథ ...

భారీ తుపాను 'అంపన్'​ బంగాల్​ కోల్​కతాలోని ఓ మాతృమూర్తికి తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికి అందొచ్చిన ఇద్దరు కుమారులను తుపాను మింగేసి.. ఆ తల్లికి కడుపుకోత మిగిల్చింది. హల్దియా ప్రాంతంలో చోటుచేసుకున్నవిషాద గాథ.... కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..!

  • పిల్లలనే లక్ష్యంగా..!

తుపాను వెలిసిందని సంతోషించాలా? వాటిల్లిన నష్టాన్ని తలచుకొని విచారించాలా? కొవిడ్‌-19 ఇప్పుడిలాంటి సందిగ్ధంలోనే పడేస్తోంది. ఇది చిన్నారులకు, యుక్త వయసు పిల్లలకు పెద్ద సంక్షోభాన్నే తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఏంటీ సమస్య? పిల్లలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది?..లింక్ క్లిక్ చేయండి...!

  • బడ్జెట్​ ఫోన్లకు భలే గిరాకీ

ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తక్కువ ధరల్లోనే నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌ ఆశిస్తున్నందున, ఇందుకు అనుగుణంగా దేశీయ కంపెనీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఫీచర్​ ఫోన్లు, బడ్జెట్ స్మార్ట్​ ఫోన్​లకు గిరాకీ పెరుగుతోంది.ఆ వివరాలెంటో చూస్తే....లింక్ క్లిక్ చేయండి...

  • కోహ్లీ నుంచి అన్నీ తీసేసుకుంటా'

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసుకోవాలనుందని అన్నాడు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​. అతడు బంతిని హిట్​ చేసే విధానం అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. ఇంకా విలియమ్సన్​ ఏమన్నాండంటే...లింక్ క్లిక్ చేయండి...!

  • వృద్ధుడని అనుకుంటున్నారు..

టీమ్​ఇండియాకు ఆడటానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఐపీఎల్​లో ఇంకా ఆడగలుగుతున్నానని.. అందుకే జాతీయ జట్టుకు ఎంపికవుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • చెమటలు పట్టించిందెవరు?

నటి అమీ జాక్సన్​.. నెలల వయసున్న తన కుమారుడితో కలిసి వ్యాయామం చేస్తున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారో తెలుస్తా...! లింక్ క్లిక్ చేయండి...

  • బాలయ్య కోసం...!

వరుస హిట్లతో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. లాక్​డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని కొత్త కథలు సిద్ధం చేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు. బాలయ్య కోసం కూడా ఓ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి....

ABOUT THE AUTHOR

...view details