ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11am

.

top ten news in  ap
top ten news in ap

By

Published : May 21, 2020, 11:01 AM IST

  • 24 గంటల్లో 5,609 కేసులు..

దేశంలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 132 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 5,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,12,359 చేరింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • 12 మంది మృతి

అంపన్​ తుపానుతో బంగాల్​ విలవిల్లాడిపోయింది. కోల్​కతా సహా అనేక ప్రాంతాల్లో తుపాను విధ్వంసం సృష్టించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • పరిహారం విడుదల

2020-21ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు రూ.15,340కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిహారాన్ని విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు పన్నుల వాటా కింద మే నెలకు గాను రూ.46,038.70 కోట్లు మంజూరు చేసినట్లు ట్విట్టర్​ వేదిక ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • మార్గదర్శకాలు

లాక్​డౌన్ సడలింపుల్లో సెలూన్లు తెరిచేందుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఆ దుకాణాలకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సెలూన్లకు వచ్చేవారు ఇంటి నుంచే తువ్వాలు తెచ్చుకోవాలని సూచించింది. ఖరీదైన సెలూన్ల సిబ్బందికి పీపీఈ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • రోడ్డుప్రమాదం

తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • అలా చేస్తే కష్టాలే

డబ్ల్యూహెచ్​ఓకు శాశ్వతంగా నిధులు నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించడంపై ఆ సంస్థలోని అత్యవసర విభాగాధిపతి డా. మైకెల్​ ర్యాన్​ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం అలా చేస్తే ప్రపంచంలోని బలహీన వర్గాలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందించడంలో జాప్యం జరుగుతుందన్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • సంస్కరణలపై ఆశలతో

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నా... కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రకటించవచ్చన్న ఆశలతో దేశీయ స్టాక్​మార్కెట్లు రాణిస్తున్నాయి. హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, రిలయన్స్ లాభాలు పుంజుకోవడం మార్కెట్లకు కలిసివచ్చింది. పూర్తి కథనం కోసం లింక్ చేయండి..

  • ద్రాక్ష పండ్లు కావాలా నాయనా!.

ఐపీఎల్​ జరగకపోయినా కొన్ని పాత వీడియోలతో అభిమానులను అలరిస్తోంది చెన్నె సూపర్​కింగ్స్​ యాజమాన్యం. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియోను షేర్​ చేసింది. అందులో మహీ ద్రాక్ష పండ్లను తింటూ కనిపించాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • గ్రీన్ సిగ్నల్!

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్​లో పెట్టిన నాని.. మరో కథకూ ఓకే చెప్పినట్లు సమాచారం.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • ఎప్పడు అవుతుందో!'

తను చేసే ప్రతి పనిని ప్రేమిస్తూ చేస్తుండటం వల్ల రోజూ సంతోషంగా ఉండగలుగుతానంటోంది నటి అనుపమ పరమేశ్వరన్​. చిత్రీకరణలో ఎప్పుడు పాల్గొంటానంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

ABOUT THE AUTHOR

...view details