- మళ్లీ వస్తా.. అందరినీ కలుస్తా : మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి
NALLARI KIRAN KUMAR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కలికిరిలో బుధవారం ఘన స్వాగతం లభించింది. తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం కలికిరికి వచ్చినట్లు సమాచారం. కలికిరిలో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమలాపురం అల్లర్ల కేసు.. డబుల్ సెంచరీ దాటిన అరెస్టులు!
ARREST: అమలాపురం అల్లర్ల కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతునే ఉంది. ఈ కేసులో తాజాగా మరో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో.. ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 217కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోకేశ్ పర్యటనలో పాల్గొంటే చర్యలు.. నేతలకు పోలీసు నోటీసులు!
TENSION AT LOKESH TOUR: నారా లోకేశ్ చేపట్టిన పల్నాడు పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోకేశ్ పర్యటనలో పాల్గొనవద్దంటూ తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ముఖ్యనేతలందరికీ నోటీసులు ఇచ్చారు. లోకేశ్ పర్యటనలో పాల్గొంటే ప్రాణనష్టం జరిగే సమాచారం ఉందంటూ నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండు శాఖల చెలగాటం.. ప్రజలకు ప్రాణసంకటం!
BRIDGE: అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే వంతెనల రహదారిపై రెండు శాఖల మధ్య నెలకొన్న వివాదం.. ప్రజలకు సమస్యగా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి రహదారి నిర్మాణంపై పురపాలక, రైల్వేశాఖల అధికారులు ఎవరికి వారు తమకేం సంబంధంలేనట్లుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు
Covid cases in india: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 13,313 మందికి వైరస్ సోకింది. మరో 38 మంది చనిపోయారు. 10,972 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గర్జించని పులి ఉద్ధవ్.. 'సాఫ్ట్' వైఖరే కొంపముంచిందా?
క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరొందిన శివసేన నిలువునా చీలిపోయే పరిస్థితులకు చేరుకుంది. మృదుస్వభావిగా పేరొందిన శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై నియంత్రణ కోల్పోవడంతో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'హిందు కుశ్' వింతకథ.. భూకంపాలకు అసలు కారణమిదేనా?
Afghan Earthquake: హిందు కుశ్ పర్వతశ్రేణుల్లో పుట్టిన భూకంపం అఫ్గానిస్థాన్‌ను అతలాకుతలం చేసింది. సుమారు 1000 మందికిపైగా చనిపోయారు. అయితే ఈ హిందు కుశ్ ప్రాంతంలో మే 9వ తేదీ నుంచి వందకుపైగా భూకంపాలు వచ్చాయట. ఒక్క అఫ్గానిస్థాన్లోనే ఆ సంఖ్య 36. అసలు ఇక్కడ అంతలా ప్రకృతి విపత్తులు సంభవించడానికి అసలు కారణమేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బ్యాంకింగ్ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్'.. డీహెచ్ఎఫ్ఎల్లో రూ.34,615 కోట్ల అవినీతి
DHFL scam: బ్యాంకు మోసానికి సంబంధించి దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్ సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.34,615 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్ జట్టుకు ఆడనున్న పంత్, బుమ్రా, పుజారా!
Teamindia England Practice match: టీమ్ఇండియా-ఇంగ్లాండ్ రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్ ఆడటానికి ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో మన ఆటగాళ్లైన పుజారా, పంత్, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ.. సామ్ ఎవన్స్ సారథ్యంలోని ప్రత్యర్థి జట్టు తరఫున ఆడనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్య 'అన్‌స్టాపబుల్'లో మెగాస్టార్.. షారుక్ సినిమాలో రానా!
బాలయ్య 'అన్‌స్టాపబుల్' రెండో సీజన్ తొలి ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. మరోవైపు షారుక్ ఖాన్-అట్లీ సినిమాలో రానా కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు