- Clashes: వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు.. నేతల మధ్య విభేదాలు
Clashes between YSRCP leaders: వైకాపాలో పలువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారు తమ సత్తాను చాటే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో.. అభివృద్ధి పనుల అమలులోనూ తీవ్రజాప్యం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TDP: ఆ పోలీసులపై ప్రైవేటు కేసులు వేసే యోచనలో తెదేపా !
Chandrababu: అక్రమ కేసులతో వేధించే పోలీసులను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్న తెలుగుదేశం.. ఆ మేరకు జాబితా సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటున్న అధిష్టానం.. వారిపై ప్రైవేటు కేసులు వేయాలని యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Medicine: యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వినియోగిస్తే.. దుష్ఫలితాలే
Un prescribed medicine: వైద్యుల సలహా లేకుండా.. సొంత వైద్యంతో యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా వచ్చే దుష్ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మనుషుల్లోనే కాకుండా పశువులు, జంతువులు, పక్షుల విషయంలోనూ నివారణ చర్యలు తీసుకోబోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Debits: మద్యం రాబడి హామీగా చూపి రూ.8,300 కోట్ల రుణం !
loan with alcohol revenue guarantee: దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని గొప్పలు పోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మద్యం రాబడినే హామీగా పెట్టి వేల కోట్ల అప్పులు చేస్తోంది. తాజాగా ఒకేసారి రూ.8,300 కోట్ల రుణం తెచ్చి.. మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇంకెంత కాలం 'మాజీ'గా ఉంచుతారు?'.. కాంగ్రెస్ కీలక నేత వ్యాఖ్యలు
Sachin Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం రాత్రి కిసాన్ సభలో పాల్గొన్న ఆయన 'ఇంకెంత కాలం నన్నెంత మాజీగా ఉంచుతారు?' అని రైతులను అడిగారు. దీంతో వెంటనే వారు.. 'పైలట్ మేము నిన్ను అభిమానిస్తూనే ఉంటాం' అని పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఎమ్మెల్యేను బహిష్కరించిన కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన హరియాణా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుల పదవితో పాటు అన్ని పార్టీ పదవుల నుంచి కుల్దీప్‌ను బహిష్కరించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాలో భారతీయ యువకుడి అరెస్టు.. వారికి అలాంటి మెయిల్స్!
Indian national arrested in US: అమెరికాలో సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ భారతీయ యువకుడిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. అక్రమ నివాసం అభియోగాలతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Insurance Policies: ఆ సందేశాలతో జర భద్రం.. లేకుంటే మీ జేబుకు చిల్లే!
Insurance Policies Messages: అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేది జీవిత బీమా పాలసీ. చాలామంది దీన్ని పెట్టుబడి సాధనంగానూ, పన్ను మినహాయింపు కల్పించే పథకంగానూ చూస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని, పాలసీదారులను మోసం చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. కాబట్టి మనకు వచ్చే సందేశాలు ఎలా ఉంటాయి? వాటిలోని నిజాలేమిటో చూద్దాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఉమ్రాన్ మాలిక్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వొద్దు'
Umran Malik Ravi Shastri: యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు అప్పుడే టీ20 ప్రపంచకప్ జట్టులో అవకాశం ఇవ్వడం సరికాదు అంటున్నాడు టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. అతను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని.. వన్డేలు లేదా టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ''మమ్మల్ని రాక్షసులుగా చూశారు'.. కన్నీళ్లు పెట్టుకున్న షారుక్'
Shah Rukh Khan: క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు విచారణలో ఆర్యన్ ఖాన్ నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురైనట్లు సిట్‌కు నేతృత్వం వహించిన వహించిన ఎన్సీబీ అధికారి సంజయ్ సింగ్ తెలిపారు. ఇక తన వద్ద బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు