ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ ముఖ్యవార్తలు

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : Apr 7, 2022, 11:00 AM IST

  • గెస్ట్​హౌస్​ ఖాళీ చేయండి.. సీబీఐ అధికారులకు ఆదేశం... కారణం ఏంటంటే..!
    Kadapa guest house: సీబీఐ కడప గెస్ట్‌ హౌస్‌లో ఉంటూ వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్నారు. గెస్ట్ హౌస్‌ గదులు ఖాళీ చేయాలని సీబీఐ అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు సీఎం జగన్​ రానున్న నేపథ్యంలో సీఎం గెస్ట్ హౌస్​లో బస చేసే వీలున్నందున ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Visakha lands: చౌకగా ఎన్​సీసీకి కోట్ల విలువైన భూమి...దేనికి సంకేతం..?
    Visakha lands: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం చౌకగా అమ్మేయడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. విశాఖలో ఎకరం రూ.15 కోట్లు పలికేచోట ఎన్‌సీసీకి రూ.1.93 కోట్లకే మధురవాడలో 97.30 ఎకరాలను తక్కువకే కట్టబెడుతున్న ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాళ్లతో కొట్టి మహిళ దారుణ హత్య.. ఆ తర్వాత తానూ..
    Man commits suicide by killing woman: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలికొంది. ఆస్పరి మండలం ముత్తుకూరులో మహిళను ఆమె బావ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు... ఇంటర్వ్యూలు లేకుండానే..?
    TSPSC Group-1, Group-2 Jobs: భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం నియామక ప్రక్రియలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త జోనల్​ విధానంతో స్థానికులకే మెజారిటీ ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంది. గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఎలక్ట్రిక్ వాహనాలపై తిరగండి'.. పెట్రోల్​ ధరలపై ప్రశ్నిస్తే మంత్రి సలహా
    Goa Minister on Fuel Price Hike: దేశంలో ఇంధన ధరల పెరుగుదల గురించి ప్రశ్నించిన ఓ వ్యక్తికి భాజపా మంత్రి విస్తుపోయే సలహా ఇచ్చారు. పెట్రోల్ రేట్లు భరించలేకపోతే.. విద్యుత్ వాహనాలు కొనుక్కోవాలని సూచించారు. పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారించడమే కాకుండా డబ్బులూ ఆదా చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారత్‌లో చిచ్చుకు అల్​ఖైదా యత్నం.. 'హిజాబ్ యువతి'పై ప్రశంసలు
    Hijab Issue: హిజాబ్‌ వివాదంపై మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్‌ అల్‌ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. హిందూ ప్రజాస్వామ్యమనే ఎండమావిని చూసి ముస్లింలు మోసపోకూడదని వీడియోలో జవాహిరీ పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఆ బ్యాగ్‌ విలువే 90 వేల డాలర్లు..ఇక అక్రమాస్తులు ఎన్నో'
    Imran Khan Wife Friend Bag: ఇమ్రాన్​ మూడో భార్య బుస్రా బీబీ స్నేహితురాలు ఫరాఖాన్​ దుబాయి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మరింది. 90వేల అమెరికన్‌ డాలర్ల బ్యాగ్‌తో ఆమె పారిపోయిందని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) నేత రొమినా ఖుర్షిద్‌ ఆలం ట్విటర్‌లో ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మానవాళిపై వాతావ'రణం'... భూతాపంతో తీవ్ర వ్యాధులు!
    CLIMATE CHANGE DISEASES: పర్యావరణ మార్పుల వల్ల జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాలు ఆహార కొరతకు, ఆహార కాలుష్యానికీ దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. భూతాపాన్ని కట్టడి చేయకపోతే ముప్పు తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'బేబీ ఏబీ' నో లుక్​ సిక్స్​ చూశారా? మ్యాచ్​కే హైలైట్​..!
    Dewald Brevis No Look Six: కోల్​కతా చేతిలో బుధవారం జరిగిన మ్యాచ్​లో ఘోరంగా ఓడిపోయింది ముంబయి ఇండియన్స్​. అయితే.. ఐపీఎల్​లో తొలిసారి ఆడిన 18 ఏళ్ల సౌతాఫ్రికా స్టార్​, బేబీ ఏబీ డివిలియర్స్​ డెవాల్డ్​ బ్రెవిస్​ సిక్స్​ మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది. బంతి ఎలా వెళ్లిందన్నది, ఎక్కడికి వెళ్లిందనేది అతడు వెంటనే చూడకపోవడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 11 ఏళ్లకే స్టార్​ హీరోతో ప్రేమలో పడ్డ నటి​.. త్వరలోనే పెళ్లి!
    చిత్రసీమలో పలువురు హీరోహీరోయిన్లు నిజజీవితంలో ప్రేమలో పడటం సహజమే. అయితే ఆ ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లిన సంఘటనలు చాలా అరుదనే చెప్పాలి.​ కానీ ఓ స్టార్​ హీరోయిన్ మాత్రం తన 11వ ఏటనే తనకన్నా పదేళ్లు పెద్దవాడైన ఓ స్టార్​ హీరోతో ప్రేమలో పడి.. ప్రస్తుతం ఆయన్నే పెళ్లి చేసుకోబోతుంది. ఇంతకీ ఆ జంట ఎవరంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details