- అమరావతి ఉద్యమం @ 300
అమరావతికి మద్దతుగా రైతులు చేపట్టిన దీక్షలు 300 వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడదామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు నివ్వగా.. ఓర్పు సహనం ఉంటే అంతిమ విజయం మనదే అని నారా లోకేశ్ నినాదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆయువుపట్టు...అమరావతి'
రాజధాని అమరావతి ఉద్యమం 300రోజులకు చేరటంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొండచరియ విరిగిపడి తల్లీబిడ్డ మృతి..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల విశాఖలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాజువాకలోని హరిజన జగ్గయ్య పాలెం, మిలిటరీ కాలనీ ప్రాంతాలు నీట మునిగాయి. గాజువాక సిందియా గణపతినగర్‌లోని ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడి తల్లీ బిడ్డ మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 15న బొమ్మ పడటం కష్టమే!
ఈ నెల 15 నుంచి సినిమా హాళ్లను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా...రాష్ట్రంలో యాజమాన్యాలు సిద్ధంగా లేవు. కొత్త సినిమాలు లేకపోవటం, విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవటం వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బలగాల అదుపులో ఇద్దరు ముష్కరులు
జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు.. బలగాల మధ్య కాల్పులు జరిగాయి. చాకచక్యంగా ఇద్దరు ముష్కరులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మరో 66 వేల కరోనా కేసులు