ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM

.

top news
ప్రధాన వార్తలు @ 9 PM

By

Published : Aug 5, 2020, 9:00 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 10,128 కరోనా కేసులు
    రాష్ట్రంలో కరోనా రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో(9ఏఎం-9ఏఎం) ఒక్క రోజులోనే 10,128 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 77 మంది చనిపోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • మూడు రికార్డులు!
    అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇవాళ భూమిపూజ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే రోజు మూడు జాతీయ రికార్డులు సృష్టించారు. అవి ఏంటో తెలుసుకుందాం..
  • తెలుగు రాష్ట్రాలకు జలాలు కేటాయింపు
    రెండు తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం 110.4 టీఎంసీల నీటి లభ్యత ఉందని బోర్డు తెలిపింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • చికిత్స ఆలస్యం... రోగి మృతి!
    108 అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణాలు విడిచింది. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా 108 అంబులెన్స్​ల సిబ్బంది వాగ్వాదానికి దిగారు. తీరా గొడవ ముగిశాక ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు
    విధుల్లో అత్యుత్సాహం, అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. పలాస ఘటనలో దురుసుగా ప్రవర్తించిన కాశీబుగ్గ సీఐపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలల్లో పోలీసుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'రామయ్యా...మోదీ మనసు మార్చవయ్యా'
    అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా తుళ్లూరులో రైతులు, మహిళలు రాముని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అయోధ్యలో కనువిందు చేసిన సంధ్యాసమయం
    సరికొత్త చరిత్రకు నాంది పలికిన అయోధ్యలోని సరయూ నదీ తీరంలో సంధ్యా సమయం కనువిందు చేసింది. ఉదయం నుంచి రామమందిర భూమిపూజ క్రతువును వీక్షించిన సూర్యుడు పశ్చిమాన వాలిపోతూ సరికొత్త అనుభూతిని పంచాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బ్రెజిల్​లో 28లక్షలు
    ప్రపంచంపై కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండటం వల్ల మొత్తం బాధితుల సంఖ్య కోటీ 87 లక్షలు, మరణాలు 7 లక్షలు దాటాయి. కోటీ 19 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'నా సిద్ధాంతం అదే'
    జట్టుకు సారథిగా వ్వవహరిస్తున్నప్పుడు.. తనను అందరి కంటే తక్కువ ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తానని అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్ రోహిత్​ శర్మ. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ జట్టుకు విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు హిట్​మ్యాన్. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'అందుకే నటించట్లేదు'
    నటిగా పరిచయమై ఐదేళ్లు పూర్తయినా సరే.. మలయాళంలో రెండే సినిమాలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది నటి అనుపమ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details