ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7PM - ఏపీ తాజా వార్తలు

...

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : May 20, 2020, 7:01 PM IST

  • పోతిరెడ్డిపాడుపై ఎన్​జీటీ స్టే...

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ విస్తరణకు బ్రేక్​ పడింది. పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వర ఎత్తిపోతలపై నేషనల్​ గ్రీన్​ ట్రైబ్యునల్ (ఎన్​జీటీ) స్టే విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • షూటింగ్​లకు అనుమతి...

లాక్​డౌన్​ తర్వాత సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్​లు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్దేశిత కాషన్ డిపాజిట్ చెల్లింపు అనంతరం షూటింగ్​లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎల్జీ క్షమాపణలు..

విశాఖ ఘటనపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఎల్జీ పాలిమర్స్ గ్రూపు ఛైర్మన్.. ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తామన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • విమాన సర్వీసులు షురూ...

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు విమానయానశాఖ సమాచారమిచ్చింది. మే 25 లోపు సర్వీసుల పునఃప్రారంభానికి అంతా సిద్ధం చేయాలని సూచించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శ్రీనగర్​లో తీవ్రవాదుల దాడి...

తీవ్రవాదుల దాడిలో ఇద్దరు బీఎస్​ఎఫ్​ జవాన్లకు గాయాలయ్యాయి.శ్రీనగర్​లోని పాండక్​ ప్రాంతంలో బీఎస్​ఎఫ్​ జవాన్లపై తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రాత్రి 7.30 గంటల లోపే..

అంపన్​ తీరం దాటేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బంగాల్ తీరాన్ని​ తాకిన తుపాను.. రాత్రి 7.30 గంటల లోపు పూర్తిగా తీరం దాటి వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఫేస్​బుక్​ షాప్స్​ తెలుసా....

చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు దిగ్గజ సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​ ఆన్​లైన్​ ​షాప్స్​ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనూ ఇన్​స్టాగ్రామ్​లోనూ వస్తాయని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సెప్టెంబరులో ఐపీఎల్​..!

సెప్టెంబరు 25 నుంచి నవంబరు 1 వరకు ఐపీఎల్​ను నిర్వహించే విషయమై బీసీసీఐ పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పడతాయన్న ఆశాభావంతో ... సన్నాహాలు చేస్తున్నామని బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ధావన్ స్టెప్పులు..

టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​.. 'సైరన్​ బీట్​' స్టెప్పులేశాడు. మొదట ధావన్​ డాన్స్​ చేస్తున్న సమయంలో అతని కుమారుడు జోరావర్​ మధ్యలో రాగా.. అప్పుడు తండ్రి కొడుకులిద్దరూ కలిసి డాన్స్​ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎన్టీఆర్ సినిమా ఫిక్స్...

తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ చేశారు. దీనిని బట్టి వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details