ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @ 11AM

ప్రధానవార్తలు @ 11AM

By

Published : Jan 28, 2021, 11:00 AM IST

ప్రధానవార్తలు @ 11AM
ప్రధానవార్తలు @ 11AM

  • జంట హత్య: ఆహారం ముట్టుకోని దంపతులు.. చిత్రవిచిత్రంగా ప్రవర్తన!

మూడు రోజుల కిందట చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్లను మూఢ భక్తితో హత్య చేసిన దంపతులు పురుషోత్తంనాయుడు, పద్మజను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరు మదనపల్లె సబ్‌జైలులో ఉన్నారు. అయితే.. దంపతులిద్దరూ నిన్నటి నుంచి ఆహారం తీసుకోవట్లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఆ గ్రామంలో... సర్పంచి పదవి విలువ... రూ.33 లక్షలు!

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీ సర్పంచి పదవికి వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.33 లక్షలకు దక్కించుకున్నారు. దుర్గాడ శివాలయంలో బుధవారం రాత్రి గ్రామపెద్దలు కొందరు సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. వైర్లు తెగిపడి ఇద్దరు మృతి

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద.. కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. స్తంభం విరిగి కరెంటు వైర్లు కారుపై పడ్డాయి. విద్యుదాఘాతానికి గురైన కారుకు మంటలు అంటుకోగా.. ఇద్దరు చనిపోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • బీటెక్​ విద్యార్థి సజీవ దహనం.. మృతిపై కుటుంబీకుల అనుమానం

బీటెక్​ చదువుతున్న ఓ విద్యార్థి సజీవ దహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో జరిగింది. రణస్థలంలోని తోటపల్లి కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు సజీవ దహనమై ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన మువ్వల నగేశ్​ గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

కర్ణాటకలోని బెల్గాం జిల్లా రాయ్​బాగాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత రాత్రి నిజాముద్దీన్​ ఎక్స్​ప్రెస్​ రైలు కింద పడి వీరు ఆత్మహత్యకు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • గాయపడ్డ పోలీసులను పరామర్శించనున్న షా

రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో గాయపడ్డ పోలీసులను కేంద్ర హోంమంత్రి నేడు పరామర్శించనున్నారు. వారిని చూసేందుకు దిల్లీలోని రెండు ఆసుపత్రులకు షా రానున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • దేశంలో మరో 14,301 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 14,301 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1.07 కోట్లకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'వాతావరణ సంక్షోభంపై పోరుకు దేశాలన్నీ ఏకం కావాలి'

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పిలుపునిచ్చారు. అందుకు తామే నాయకత్వం వహిస్తామని చెప్పారు. అమెరికాలో చమురు, గ్యాస్​ కొత్త లీజులను నిలిపివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఆ​ టైటిల్ గెలవడమే నా లక్ష్యం: థీమ్​

అస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొననున్న ప్రపంచ మూడో ర్యాంకర్‌ డొమినిక్​ థీమ్‌ (ఆస్ట్రియా).. తన తదుపరి పెద్ద లక్ష్యం ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ను గెలవడమేనని చెప్పాడు. ఈ టోర్నీ తనకెంతో ఇష్టమని చెప్పిన ఇతడు.. ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ను సొంతం చేసుకోవడానికి బాగా శ్రమిస్తున్నాని అన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • వరుణ్​ 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్.. 'సలార్'​లో శ్రుతి హాసన్

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' చిత్రంలో హీరోయిన్​గా ఎంపికైంది శ్రుతిహాసన్. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details