సోమవారం గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ - నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేటెస్ట్ వార్తలు
14:06 July 17
సోమవారం గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్
సోమవారం గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవనున్నారు. తన పునఃనియామకంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని రమేష్‌కుమార్‌కు హైకోర్టు సూచించింది. ఎస్‌ఈసీగా నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన్ను కోరనున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ'... నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మూడుసార్లు నిరాకరించినా... ఎందుకు ఆయనను నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు తన పునఃనియామకంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని రమేష్‌కుమార్‌కు కోర్టు సూచించింది.