రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు70వ వనమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.సీఎంతో పాటు పలువురుమంత్రులు,ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గుంటూరు జిల్లా అమీనాబాద్కు జగన్ చేరుకుంటారు.అక్కడినుంచి రోడ్డు మార్గంలో డోకిపర్రు చేరుకొని అక్కడ మెుక్కను నాటనున్నారు.అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభిస్తారు.అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగాణానికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.సీఎం పర్యటన దృష్ట్యా డోకిపర్రు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
70వ వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరు జిల్లా డోకిపర్రులో జరగనున్న 70వ వన మహోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా డోకిపర్రులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
జగన్