ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి - వరికోలులో ముగ్గురు మృతి

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులో ముగ్గురు యువకులు మృతి చెందారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా మోయతుమ్మెద వాగులో స్నానానికి దిగిన యువకులు ఈత రాకపోవడం వల్ల మరణించారు.

మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి

By

Published : Nov 12, 2019, 2:39 PM IST

మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. కార్తిక పౌర్ణమి వేళ ముగ్గురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ సందర్భంగా వేకువజామున మోయతుమ్మెద వాగులో స్నానానికి వెళ్లిన నిఖిల్​, కూన ప్రశాంత్​, వరప్రసాద్​ మరణించారు. స్నానానికి వెళ్లి ఎంత సేపటికీ తిరిగిరాకపోవడం వల్ల అనుమానమొచ్చిన ఇరుగు పొరుగు వాగులో వెతికారు. ముగ్గురి మృతదేహాలను బయటకుతీశారు. ఈత రాకపోవడం వల్లనే ముగ్గురు యువకులు మరణించారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details