జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందో కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో కంపెనీ మాజీ కార్యదర్శి పి.ఎస్.చంద్రమౌళి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హెటిరో, అరబిందోపై ఈడీ నమోదు చేసిన కేసు శుక్రవారం సీబీఐ/ఈడీ కోర్టు ముందు విచారణకు వచ్చింది.
Jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - Andhra News
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. అరబిందో, హెటిరోపై ఈడీ కేసులో అభియోగాల నమోదుపై విచారణ చేపట్టారు.ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో కంపెనీ మాజీ కార్యదర్శి పి.ఎస్.చంద్రమౌళి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న చంద్రమౌళి ఏప్రిల్ 10న చనిపోవడంతో ఆయన మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఆదేశించింది. అభియోగాల నమోదు కోసం కేసును వాయిదా వేసింది. ఇదే కేసులో విచారణలో తన తరఫున మరో నిందితుడు సహకరించడానికి అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాగా 22వ తేదీకి వాయిదా వేసింది. వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణను, రాంకీ కేసులో రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... CM Jagan With Union Ministers: జగన్ దిల్లీ టూర్.. ఎవరెవరిని కలిశారంటే..