ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జనవరి 4 లేదా 5న టెట్ షెడ్యూల్.. ఈసారి ఏడేళ్ల అర్హత' - TET schedule will be released on the fourth or fifth of next month

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్​ నిర్వహణకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 4 లేదా 5న షెడ్యూల్​ విడుదల కానుంది. పాఠశాల విద్యా శాఖ దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. షెడ్యూల్​ విడుదలైన వారం తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు.

4 లేదా 5న టెట్ షెడ్యూల్..ఈ సారి ఏడేళ్ల అర్హత
4 లేదా 5న టెట్ షెడ్యూల్..ఈ సారి ఏడేళ్ల అర్హత

By

Published : Dec 24, 2019, 5:01 AM IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్ వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన విడుదల కానుంది. షెడ్యూల్ ఇచ్చిన వారం తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రతి ఏడాది టెట్​ను రెండు పర్యాయాలు నిర్వహించాల్సి ఉండగా గతేడాది ఫిబ్రవరిలో ఒక్కసారే నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ నిర్వహించనున్నందున ముందుగానే టెట్ నిర్వహణకు షెడ్యూల్ రూపొందించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలా..? వద్దా..? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతేడాది నిర్వహించిన టెట్​పై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల ఈసారి ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. ఎస్జీటీ, స్కూల్​ అసిస్టెంట్లకు రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఆంగ్లం పేపరు వేరుగా ఉండనుంది.

ఆన్​లైన్ ఉంటుందా?

గతేడాది టెట్​ను మొదటిసారిగా ఆన్​లైన్​లో నిర్వహించారు. రాష్ట్రంలో కంప్యూటర్ల సదుపాయం లేకపోవటం వల్ల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​ల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ టెట్ ఆన్​లైన్​లో నిర్వహించాలా..? ఆఫ్​లైన్​లో నిర్వహించాలా? అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెట్​లో వచ్చే మార్కులకు టీఆర్టీలో 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈసారి టెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్కుల మెరుగు కోసం ఒకటి రెండు పర్యాయాలు రాసిన వారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఒకసారి టెట్ రాస్తే ఏడేళ్ల వరకు అర్హత ఉంటుంది.

ఇవీ చూడండి:

'ఇన్​సైడర్​​ ట్రేడింగ్​ జరగలేదంటే రాజీనామా చేస్తారా'

ABOUT THE AUTHOR

...view details