రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో తప్పులేదని తేలితే రాజీనామాకు మీరు సిద్ధమా.. అని ఆర్థికమంత్రి బుగ్గనను తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విజయవాడలోని ద్వారా సవాల్ చేశారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిందని వైకాపా నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అమరావతి దళిత, బడుగు, బలహీన వర్గాల రాజధాని అని ఆమె అన్నారు. రాజధానికి తూట్లు పెట్టి సినిమా చూపిస్తుంటే కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అటువైపు చూడలేదని దుయ్యబట్టారు. ఈలాంటి చర్యలకు వారు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని ఆమె అన్నారు. తెలుగుదేశం హయాంలో విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడంలో చంద్రబాబు సఫలీకృతమయ్యారని అనురాధ గుర్తు చేశారు.
ఇదీ చదవండి: