ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ లేకుండా మద్యం తెచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 3 మద్యం సీసాలు కూడా తెచ్చుకునేందుకు వీల్లేదని పేర్కొంది. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చేందుకు కేంద్రం నిబంధనల మేరకు అనుమతినిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్షార్హులని అబ్కారీశాఖ పేర్కొంది.
గత ఏడాది అక్టోబరు 12 తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక్కో వ్యక్తి 3 బాటిళ్ల మద్యాన్ని కలిగి ఉండవచ్చని జారీ చేసిననప్పటికీ ..ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎలాంటి సుంకం చెల్లించకుండా రాష్ట్రంలోనికి అక్రమంగా తీసుకువస్తున్న ఈ తరహా మద్యం వల్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.