ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాలల హక్కుల రక్షణ కమిషన్​ సభ్యులను నియమించకపోవటంపై పలువురికి నోటీసులు

By

Published : Mar 2, 2022, 3:43 AM IST

రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్​కు సభ్యులను నియమించకపోవటంపై ధాఖలైన పిటిషన్​పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా పలువురి నోటీసులు జారీ చేసింది. అనంతంరం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

HC
HC

రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్​కు ఛైర్ పర్సన్ , సభ్యులను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , మహిళ, శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి , మహళాభివృద్ధి , శిశుసంక్షేమ డైరెక్టర్​కు నోటీసులు జారీచేసింది. అనంతంరం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

బాలల హక్కుల కమిషన్ పూర్వ ఛైర్ పర్సన్ , సభ్యుల కాలపరిమితి పూర్తయి 18 నెలలు గడుస్తున్నా కొత్త వారిని నియమించడం లేదని పేర్కొంటూ విశాఖపట్టణానికి చెందిన న్యాయవాది బి.ప్రవీణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ సభ్యుల , చైర్ పర్సన్ నియామకానికి మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ దరఖాస్తులను ఆహ్వానించారన్నారు. ప్రభుత్వం 2021 ఏప్రిల్ 7 న జీవో 55 జారీచేస్తూ ముగ్గురు సభ్యులతో ఎంపిక కమిటీని నియమించిందన్నారు. తగిన వ్యక్తులను నియమించే నిమిత్తం ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. గతేడాది సెప్టెంబర్ 15 తో ఆ ప్రక్రియ పూర్తయిందన్నారు. నియామకానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి అయినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదో అధికారులకే తెలియాలన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ ప్రక్రియలో ఉందన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

ఇదీ చదవండి:high court : 'సాక్షులను బెదిరించినట్లు ఆధారాలుంటే కోర్టు ముందు ఉంచండి'

ABOUT THE AUTHOR

...view details