ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘గంగవరం’లో వాటా గుట్టుగా విక్రయం! - Gangavaram port latest news

గంగవరం నౌకాశ్రయంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.40 శాతం వాటాను అదానీ పోర్ట్స్ కు విక్రయించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గంగవరం పోర్టులో వాటాల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ తెలిపారు.వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

High Court
High Court

By

Published : Sep 10, 2021, 5:25 AM IST

గంగవరం నౌకాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.40 శాతం వాటా (షేర్ల)ను అదానీ పోర్ట్స్‌కు విక్రయించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబాళ్లపల్లికి చెందిన డాక్టర్‌ సత్య భూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వాటా విక్రయ వ్యవహారమంతా గోప్యంగా జరిగిందన్నారు. అదానీ పోర్ట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ వాటా విక్రయించేందుకు ఐఏఎస్‌ అధికారితో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వ 10.40 శాతం వాటా విక్రయానికి ఆమోదం లభించినట్లు ‘ఏపీ మారిటైమ్‌ బోర్డు’ తమకు తెలిపిందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌).. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చిందన్నారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. ఆమోదానికి సంబంధించిన లేఖలు, జీవోలు ప్రజలకు అందుబాటులో లేవన్నారు. పోర్టుల్లో ప్రభుత్వ వాటా అదానీ సంస్థకు విక్రయ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పాత్రపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని కోరారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఒప్పందాలు, జీవోల నోట్‌ఫైళ్లను పరిశీలించాలని కోరారు. ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కాగ్‌ను ఆదేశించాలన్నారు. రూ.9 వేల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాను అదానీ సంస్థ కేవలం రూ.645 కోట్లుకు దక్కించుకునేందుకు ముందుకొచ్చిందన్నారు. విక్రయ ప్రక్రియకు సంబంధించి గతంలో జారీ చేసిన మూడు జీవోల అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు వాటా విక్రయంలోనూ పారదర్శకత లేదన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల కార్యకలాపాలు సాఫీగా నిర్వహించేందుకు విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలన్నారు.

కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గంగవరం పోర్టులో వాటాల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల వ్యవహారాలు రెండూ వేర్వేరన్నారు. లబ్ధిదారులైన కంపెనీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చలేదని చెప్పారు. వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

high court: బహిరంగ ప్రదేశాల్లో మండపాలకు అనుమతించలేం

ABOUT THE AUTHOR

...view details