అరబిందో, హెటిరో భూకేటాయింపులపై ఈడీ కేసు విచారణలో తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతించాలన్న సీఎం జగన్ పిటిషన్పై విచారణ జులై 2కి వాయిదా పడింది. జగన్ తరఫు వాదనల కోసం సీబీఐ, ఈడీ కోర్టు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఈడీ కేసుల విచారణ ఇవాళ జరిగింది. ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు.
JAGAN PETITION: సీఎం జగన్ పిటిషన్పై విచారణ జులై 2కి వాయిదా
తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతించాలన్న సీఎం జగన్ పిటిషన్పై విచారణ జులై 2కి వాయిదా పడింది. ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు.
పిటిషన్లను త్వరగా విచారణ కేసుల జాబితాలో పెట్టాలని రిజిస్ట్రార్ జనరల్ కోరుతూ.. ఈనెల 17న న్యాయవాది లేఖ కూడా రాశారని విజయసాయి వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందునా.. పిటిషన్లు విచారణకు రాలేదన్నారు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందునా.. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. విజయసాయిరెడ్డి అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ, ఈడీ కోర్టు విచారణను జులై 2కి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... YSR cheyutha: కుటుంబానికి మహిళలే రథసారధులు: సీఎం జగన్