రాష్ట్రంలో పాలన చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా "గడప గడపకు మన ప్రభుత్వం" పేరుతో ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీపరంగా చేపట్టాలనుకున్న ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొనాలని చెప్పడం వివాదాస్పదం కావడంతో... ప్రభుత్వం దాన్ని అధికారిక కార్యక్రమంగా మార్చుతూ జీవో ఇచ్చింది. వైకాపా మేనిఫెస్టోలో 95 శాతం హామీలను పూర్తి చేసినట్టు జీవోలో పేర్కొంది.
వైకాపా మూడేళ్ల పాలన పూర్తి... గడప గడపకు 'పార్టీ' కాదు.. ప్రభుత్వం
'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహిస్తోన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మూడేళ్లలో వైకాపా సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు మెుదట "గడప గడపకూ వైకాపా" పేరుతో కార్యక్రమం నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొంటే విమర్శలు వస్తాయని భావించి దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటినీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎమ్మెల్యేలు సందర్శించాలని తెలిపింది.
ఇదీ చదవండి:రాష్ట్రం ఖర్చు చేసిన ఆ డబ్బును.. కేంద్రం నుంచి రాబట్టాలి: సీఎం జగన్