ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కథ బాగుంది.. రాత్రుళ్లు చర్చిస్తే ఇంకా బాగుంటుంది..' - షి బృందాలు తాజా వార్తలు

sexual assault: తన కోర్కె తీర్చకుంటే సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా అంటూ మహిళా కథా రచయితను.. ఓ సినీ నిర్మాత బెదిరించాడు. దీంతో ఆమె గోల్కొండ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏమైందంటే..?

sexual assault
sexual assault
author img

By

Published : May 20, 2022, 1:36 PM IST

sexual assault: "నీ కథ బాగుంది.. సినిమా తీసేందుకు అవసరమైనన్ని సన్నివేశాలున్నాయి. కథను మరింతగా మెరుగు పరిచేందుకు మనం రాత్రుళ్లు చర్చించుకుందాం. ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ నా కోరిక తీర్చు.. సినిమా అవకాశాలు దక్కాలనే నీ కోరిక నేను తీరుస్తా. ఒకవేళ నా కోర్కె తీర్చలేదనుకో.. సినీ పరిశ్రమలో నువ్వు అడుగు పెట్టకుండా చేస్తా" అంటూ.. మహిళా కథా రచయితను బెదిరించాడు ఓ సినీ నిర్మాత. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆరునెలల క్రితం.. ఆన్‌లైన్‌లో పరిచయం
హైదరాబాద్‌లో ఉంటున్న మహిళా కథా రచయిత తన వద్ద ఉన్న కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునెలల క్రితం ఒక సినీ నిర్మాత ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. విభిన్న నేపథ్యమున్న కథలు, సంఘటనలను సినిమాలుగా తీస్తానని, ఖర్చు ఎంతైనా ఇబ్బంది లేదంటూ మహిళా రచయితకు చెప్పాడు. కథ, సన్నివేశాల ప్రతిని ఆమె నిర్మాతకు అందచేశారు. కథను చదువుతానంటూ చెప్పిన నిర్మాత ఆమె ఫోన్‌ చేసినప్పుడల్లా తర్వాత మాట్లాడదాం అనేవాడు. కొద్దిరోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్‌ చేశాడు. కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుదని అన్నాడు. అప్పటి నుంచి వరుసగా రాత్రుళ్లు ఫోన్లు చేసి లైంగిక కోర్కెలు తీర్చాలని.. లేదంటే ఒక్క సినిమాకు రాయకుండా అడ్డుకుంటానంటూ ఆమెను బెదిరించాడు. బాధితురాలు భయంతో 'షి' టీమ్​ను ఆశ్రయించగా.. నిర్మాతను అదుపులోకి తీసుకుని, గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

నాలుగు నెలల్లో 423 ఫిర్యాదులు..

  • బెదిరింపులు, ఈవ్‌టీజింగ్‌లతో తమను భయపెడుతున్నారంటూ నాలుగునెలల్లో 423మంది బాధితులు ‘షి’బృందాలను ఆశ్రయించారు. ఇందులో 203 మంది నేరుగా రాగా.. 181మంది 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ చేశారు. మిగిలిన 39మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారని డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు.
  • ‘షి’బృందాలను ఆశ్రయించిన వారి ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు 57 కేసులను నమోదు చేయించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 52మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 15మందిపై పెట్టీకేసులు నమోదు చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌ పాల్పడుతున్న 191మంది పురుషులు, 23మంది బాలురకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.
  • చార్మినార్‌ ఠాణా పరిధిలో నివాసముంటున్న ఒక యువతిని తీవ్రంగా వేధిస్తున్న సయ్యద్‌ అబ్దుల్‌ హసన్‌ను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరిచారు. కోర్టు అతడికి 8 రోజుల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
  • సంతోష్‌ నగర్‌ క్రాస్‌రోడ్స్‌ సమీపంలోని ఓ కళాశాల వద్ద ఈవ్‌టీజింగ్‌ చేస్తున్న మహ్మద్‌ సొహైల్‌ను అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచగా అతనికి 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • నిన్నూ, నీభర్తను చంపేస్తానంటూ నిత్యం ఫోన్లు, సందేశాలతో ఒక యువతిని బెదిరిస్తున్న ఇ.శ్రీనివాస్‌ను ‘షి’బృందం పోలీసులు ఓయూ ఠాణాలో అప్పగించారు.
  • సంతోష్‌నగర్‌లో ఉంటున్న ఒక యువతిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న షేక్‌ మోతిషామ్‌ అహ్మద్‌ను ‘షి’బృందం పోలీసులు అదుపులోకి తీసుకుని సంతోష్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details