ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రూప్-1 మెయిన్స్​పై సీఎంకు తెలుగు యువత అధ్యక్షుడి లేఖ

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాల్యుయేషన్​లో వ్యత్యాసాలున్నాయంటూ పలువురు అభ్యర్థులు విద్యార్థి, యువజన సంఘాలను కలిశారని.. కీలకమైన ఈ ఉద్యోగాలు ఎంపికలో అవకతవకలు, పక్షపాతం లేకుండా పారదర్శకంగా చేపట్టాలని తెలుగు యువత అధ్యక్షులు చినబాబు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌, ఏపీపీఎస్సీ(APPSC) ఛైర్మన్‌ భాస్కర్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు.

Shriram Chinababu
శ్రీరామ్ చినబాబు

By

Published : Jun 14, 2021, 1:45 AM IST

ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష పేపర్ డిజిటల్ వాల్యుయేషన్ ఫలితాలపై అభ్యర్థులకు పలు అనుమానాలున్నాయని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌, ఏపీపీఎస్సీ(APPSC) ఛైర్మన్‌ భాస్కర్‌లకు లేఖలు రాశారు. ఎలాంటి ముందస్తు అధ్యయనం లేకుండా డిజిటల్ వాల్యుయేషన్​ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోందన్నారు.

యూపీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సైతం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించలేకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారు. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చెయ్యాలని డిమాండ్‌ చేశారు. మాన్యువల్ వేల్యూష‌న్ చేయ‌డం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోయారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details