ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2021, 8:49 AM IST

ETV Bharat / city

వైద్య సలహాల కోసం ఉచితంగా నిపుణుల టెలి కన్సల్టేషన్‌

కొవిడ్‌ చికిత్స కోసం 104 కంట్రోల్‌ రూముకు వచ్చే కాల్స్ ఆధారంగా టెలి కన్సల్టేషన్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 2,310 మంది వైద్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను వారు తెలియజేయనున్నారు.

వైద్య సలహాల కోసం ఉచితంగా నిపుణుల టెలి కన్సల్టేషన్‌
వైద్య సలహాల కోసం ఉచితంగా నిపుణుల టెలి కన్సల్టేషన్‌

కొవిడ్‌ చికిత్స కోసం 104 కంట్రోల్‌ రూముకు వచ్చే కాల్స్ ఆధారంగా టెలి కన్సల్టేషన్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 2,310 మంది వైద్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. లక్షణాలు ఎలా ఉన్నాయి? ఏయే మందులు వాడాలి? వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారా? లేదంటే ఎక్కడ చేయించుకోవాలి? ఇతర సలహాలు, సూచనలను తమను సంప్రదించిన వారికి వైద్యులు తెలియజేస్తారు. కేటాయించిన సమయాన్ని బట్టి గంటకు 400 రూపాయల చొప్పున చెల్లిస్తారు.

వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ ఆధారంగా పేర్లు నమోదు చేసుకున్న 2,310 మందిలో 500 మంది వరకు నిపుణులు ఉన్నారు . వీరిలో ఉద్యోగ విరమణ చేసిన వారితోపాటు ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు, ప్రస్తుతం పీజీ చేస్తున్న వాళ్లూ ఉన్నారు. అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి 104కు వచ్చే కాల్స్ వారి సెల్​ఫోనుకు పంపుతారు. వీరు కేటాయించిన సమయాన్ని బట్టి పది రోజుల్లోనే చెల్లింపులు చేస్తామని స్టేట్ కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షకులు అహ్మద్ బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details